Sales Executive Jobs in HDB :
Hi Friends మీ దగ్గరలో ఉన్న HDFC బ్యాంకుల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పని చేయడానికి HDB Financial Services వాళ్ళు 500 ఉద్యోగాల కోసం ఎటువంటి పరీక్ష కూడా పెట్టకుండా 31st డిసెంబర్ కల్లా ఉద్యోగాలు ఇవ్వడానికి రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు. ఈ Sales Executive ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
About HDB Financial Services :
- HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ (HDBFS) అనేది ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC), ఇది వ్యక్తిగతంగా సేవలందిస్తూ, ఆకాంక్షాత్మక భారతదేశం యొక్క పెరుగుతున్న అవసరాలను తీరుస్తుంది.
- వీళ్లు కస్టమర్‌లకు విస్తృతమైన సురక్షితమైన మరియు అసురక్షిత రుణాలను అందిస్తూ ఇంకా రుణాలు, పెట్టుబడులు లేదా రక్షణ వంటి అన్ని అవసరాల కోసం వన్-స్టాప్ షాప్‌ను అందిస్తున్నారు.
- ఈ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్లు 27 రాష్ట్రాలలో 1,747 కంటే ఎక్కువ శాఖలను కలిగి ఉంది.
- BPO సేవల అనగా ప్రాసెసింగ్, డాక్యుమెంట్‌ల వెరిఫికేషన్, ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ సేవలు మరియు కరస్పాండెన్స్ మేనేజ్‌మెంట్ వంటి బ్యాక్ ఆఫీస్ సేవలను కూడా అందిస్తారు.
- So మీరు కూడా ఇందులో పర్మనెంట్ గా ఇందులో ఉద్యోగం చేయాలనుకుంటే అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.
Sales Executive Role :
- సేల్స్ ఎగ్జిక్యూటివ్ గ వ్యాపారాలను సోర్సింగ్ చేయాలి.
- సేల్స్ అవకాశాలను గుర్తించే సామర్థ్యం ఉండాలి.
- మీకు కేటాయించిన కస్టమర్లతో మరియు బ్రాంచ్‌లతో సంబంధాన్ని నిర్వహించగలగాలి.
- సేల్స్ ఎగ్జిక్యూటివ్ గ టీమ్ లీడర్ / సేల్స్ మేనేజర్ / బ్రాంచ్‌తో చాలా సన్నిహితంగా పని చేయాలి.
- రోజువారీ ప్రాతిపదికన కేటాయించబడిన బ్రాంచ్‌ను సందర్శించడం మరియు లీడ్ జనరేటీ కోసం బ్రాంచ్ సిబ్బందిని కలవాల్సి ఉంటుంది.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి మొదట్లో బ్యాంకు వాళ్లే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అనగా డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి మీకు ఉన్న చదువు అర్హత, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి ₹1,50,000 నుంచి ₹1,75,000 వరకు జీతం ఇస్తారు.
- ఇంకా మీకు నెల జీతంతో పాటు attractive incentives కూడా చేస్తారు.
NOTE : ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీ దగ్గర్లో ఉన్న HDFC బ్యాంకులో పని చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్న పురుషులు మరియు మహిళలు ప్రతి ఒక్కరు అర్హులే.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా పెట్టకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
- ఇంటర్వ్యూ సమయం — 24th డిసెంబర్ 2024 నుండి 31st డిసెంబర్ 2024 వరకు, రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 వరకు ఇంటర్వూస్ పెట్టి ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ వేదిక — HDFC Bank,Meenakshi Tech Park, C Block,1st Floor,#341-374,Opposite Deloitte Campus, Survey Number – 39, Bamboos Phase 2,Gachibowli, Hyderabad – 500081.
మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకుపోవలసినవి.
- Updated Resume
- Pan card
- Aadhaar card with full DOB
- 10th &12th Marks Sheets
- Previous company’s Reliving letter ( If applicable )
- Any bank passbook (Active Account only)
- Passport size photo
So మీ దగ్గరలో ఉన్న HDFC బ్యాంకుల్లో Sales Executive గ పని చేయాలని ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి పర్మనెంట్ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ Sales Executive ఉద్యోగాలకి ఎటువంటి దరికాస్తూ Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.
Important Link :
Note :
- ఈ ఉద్యోగాలకి కీ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
CACTUS Customer Service Remote Jobs | ఇంటినుండే పని చేసే ఉద్యోగాలు | Latest Work From Home Jobs
Work From Home Internship & Job Opportunity | ఒక నెల ఇంటర్న్‌షిప్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు
Infosys Recruiting for Customer Support Jobs | మొదటి సారి Infosys లో 12th వాళ్ళకి ఉద్యోగాలు
2 thoughts on “HDB Financial Services Recruiting for 500 Jobs | పరీక్ష లేకుండా బ్యాంకుల్లో ఉద్యోగాలు | Latest Bank Jobs in AP & TS”