భారత సుప్రీం కోర్టు 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలు గ్రూప్ B, నాన్-గెజెటెడ్ కేటగిరీలోకి వస్తాయి. దరఖాస్తుదారులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, కంప్యూటర్ నైపుణ్య పరీక్ష, టైపింగ్ టెస్ట్ మరియు డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు క్రింది వివరాలను పరిశీలించి, నిర్ణీత తేదీలలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధాన తేదీలు
వివరాలు | తేదీ |
---|---|
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | 5 ఫిబ్రవరి 2025 |
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ | 8 మార్చి 2025 |
పోస్టుల వివరాలు & అర్హతలు
- పోస్టు పేరు: జూనియర్ కోర్టు అసిస్టెంట్
- ఖాళీలు: 241
- అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత
- అవసరమైన నైపుణ్యాలు: టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యం
ఎంపిక విధానం
- రాత పరీక్ష
- కంప్యూటర్ నైపుణ్య పరీక్ష
- టైపింగ్ పరీక్ష
- డిస్క్రిప్టివ్ టెస్ట్
వయస్సు పరిమితి
వర్గం | కనీస వయస్సు | గరిష్ట వయస్సు | వయస్సు సడలింపు |
---|---|---|---|
సాధారణ (GEN) | 18 ఏళ్లు | 30 ఏళ్లు | లేదు |
OBC | 18 ఏళ్లు | 33 ఏళ్లు | 3 సంవత్సరాలు |
SC/ST | 18 ఏళ్లు | 35 ఏళ్లు | 5 సంవత్సరాలు |
దరఖాస్తు ఫీజు
వర్గం | దరఖాస్తు ఫీజు |
---|---|
సాధారణ (GEN) / OBC | ₹1000 |
SC / ST అభ్యర్థులు | ₹250 |
జీతం & ఇతర ప్రయోజనాలు
- నెలకు ₹72,040/- జీతం
- ఇతర అలవెన్సులు అందుబాటులో ఉంటాయి
అవసరమైన పత్రాలు
✅ పూర్తిగా భర్తీ చేసిన దరఖాస్తు ఫారం
✅ విద్యార్హత సర్టిఫికెట్లు (10th, ఇంటర్, డిగ్రీ)
✅ వయస్సు ధ్రువీకరణ పత్రం
✅ కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/OBC అభ్యర్థులకు)
✅ రెసిడెన్సీ & స్టడీ సర్టిఫికెట్లు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- సుప్రీం కోర్ట్ అధికారిక వెబ్‌సైట్ నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన పత్రాలతో పాటు సమర్పించాలి.
- దరఖాస్తు ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
👉 వెబ్‌సైట్‌లో పూర్తి నోటిఫికేషన్ చూసి వెంటనే అప్లై చేయండి! ✅
Also Check:
Meesho Associate Training Job – చిన్న వ్యాపారాలను డిజిటల్ ప్రపంచంలోకి తీసుకెళ్లే అవకాశాన్ని పొందండి!
1 thought on “SCI Jobs Notification 2025 | భారత సుప్రీం కోర్టులో 241 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు”